రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాం
అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఇవ్వాల్సిన సముచిత స్థానం ఇవ్వకుంటే రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ హెచ్చరించారు.
బాపట్ల జిల్లా ఇంచార్జీ అఖండ భూమి వెబ్ న్యూస్
పీవీ పాలెం మండల కేంద్రం గౌడ పాలెంలో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నేతల సమావేశం గురువారం జరిగింది. ఈ నెల 27వ తేదీన బాపట్ల జిల్లా కేంద్రంలో బీసీ, మైనారిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. దమాషా లెక్కల ప్రకారం బీసీల రిజర్వేషన్ అమలు, స్టడీ సర్కిల్ భవనాలు, కుల జనగణన, పలు సమస్యలపై చర్చ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య, జిల్లా న్యాయసలహాదారుడు అంగలకుదురు నటరాజన్, నియోజకవర్గ అధ్యక్షుడు పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, నేతలు సోమయ్య, ధనుంజయ్, బొలగాని భాస్కరరావు, ఎనుముల నాగేశ్వరరావు ఈవూరి శ్రీను, ఈవూరి వెంకటేశ్వరరావు, మన్యం సాంబశివరావు, వెంకటరామయ్య, వివేక్, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



