ఈదురు గాలులకు నేలకు ఒరిగిన16ఎకరాలు మామిడి, అరటి పంటలు

ఈదురు గాలులకు నేలకు ఒరిగిన16ఎకరాలు మామిడి, అరటి పంటలు

క్షేతగాత్రులు అయినా వావిలపాడు రైతులు

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

వేపాడ మే 25 అఖండ భూమి వెబ్ న్యూస్ :

మండలంలో బుధ, గురువారాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి మామిడి, అరటి పంటలు నేలమట్టమై రైతులు వ్యాపారులు కుదేలైపోయారు. పంట చేతికందే దశలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యం వల్ల మండలంలోని వావిలపాడు గ్రామంలో కూమిరెడ్డి అప్పలనాయుడు, గండి నారిబాబు లకు చెందిన ఎనిమిది ఎకరాల మామిడి తోటలో విపరీతంగా వీచిన గాలులకు మామిడి కాయలన్నీ నేలరాలిపోవడంతో రైతులు పూర్తిగా నష్టాల పాలయ్యారు. అలాగే అదే గ్రామానికి చెందిన రంధి భారతికి చెందిన మూడు ఎకరాల అరటి తోట, బైలపూడి అబద్దం నకు చెందిన ఒక ఎకరా అరటి తోట, బైలపూడి సత్తిబాబుకి చెందిన అర ఎకరంలో అరటితోట, వర్రి ఈశ్వరమ్మకి చెందిన ఒక ఎకరా అరటి తోట ఈదురుగాలులకు పూర్తిగా నేలకోరిగి ధ్వంసం కావడంతో అరటి గెలలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు 16ఎకరాల్లో మామిడి అరటిపంటలు దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం దెబ్బతిన్న పంటల సర్వే జరిపి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మండలంలోని బక్కునాయుడుపేట గ్రామానికి చెందిన సబ్బి అప్పారావు, బానాది గ్రామానికి బండారు గంగునాయుడు, కర్రి పెదనాయుడు తదితర రైతులకు చెందిన మామిడి పంటలు కూడా పూర్తిగా ధ్వం సమయ్యాయి. గతంలో ఎన్నడూ ఇంతనష్టం సంభవించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదు కోకుంటే మామిడి, అరటి రైతులు పూర్తిగా కుదేలైనట్లేనని ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈదురు గాలులకు అనేక చోట్ల చెట్లు, చెట్ల కొమ్మలునేలకొరగగా,విద్యుత్ వైర్లు, స్తంబాలు దెబ్బతిని విద్యుత్ సరఫరాకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది.

Akhand Bhoomi News

error: Content is protected !!