మీకు మేము ఉన్నాం అంటున్న ఫ్రెండ్లీ పోలీస్
బిక్కవోలు. బిక్కవోలమండలం లో తరుచు గా కొన్ని గ్రామాల లో జరుగుతున్న దొంగతనాలు చూస్తూ ఉన్నాం అయితే ప్రజలు భద్రత దృష్ట్యా వారు కి రక్షణ కలపించడానికి బిక్కవోలు ఎస్ ఐ బుజ్జి బాబు ఒక మంచి ఆలోచన తో గ్రామ మహిళా పోలీస్, వాలంటీర్ లు ద్వారా ప్రజలు కు సూచనలు ఇచ్చారు. అది ఏమిటీ అంటే గ్రామం లో ప్రజలు ప్రయాణలు నిమిత్తము యాత్ర లు బంధువులు ఇంటి కి వెళ్లి వారం,10రోజు లు ఉండాలిసి వచ్చినపుడు ఏ రోజు బయలు దేరుతున్నారు ఏ రోజు మరల వస్తారు అనేది మీ ఇంటి కి లాక్ వేసి వెళ్ళేటప్పుడు మీ పరిధిలో ఉన్న వాలంటీర్ కి వివరాలు తెలియచేస్తే వారు ఆ సమాచారం తీసుకొని గ్రామ మహిళా పోలీస్ వారు కి తెలియచేస్తారు.. వారు ఆ ఇంటి కి రాత్రి సమయం లో బందోబస్త్ ఏర్పాటు చేసి పోలీస్ వారు పర్యవేక్షణ లో ఉంటుంది మీరు ఎటువంటి భయం లేకుండా సంతోషం మీ టూర్ పూర్తి చేసుకొని రావచ్చు.. చాలా వరుకు చూస్తున్నాం లాక్ వేసి ఉన్న ఇళ్ల ను దొంగలు టార్గెట్ చేస్తూ రెండు మూడు రోజులు నిగా పెట్టి ఆ ఇంటి ని దోచుకొంటున్నారు మనము వచ్చే సరికి ఇంట్లో ఉన్న డబ్బు నగలు విలువ అయినా వస్తువులు మాయం అవుతున్నాయి. కనుక ప్రతీ ఒక్కరూ తప్పకుండ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పోలీస్ వారు కి సహకరించగలరు అని ఎస్ ఐ బుజ్జి బాబు తెలియచేశారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



