ఈదురు గాలులకు కూలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్.
వేపాడ,మే,25(అఖండ భూమి వెబ్ న్యూస్ : – మండలంలోని గురువారం సాయంత్రం వీచిన భారీ గాలులకు జాకేరు గ్రామంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నేల కూలింది.దీంతో గ్రామంలో కొంత సమయం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందికి గురయ్యారు.వెంటనే విద్యుత్ సిబ్బంది స్పందించి వేరే ట్రాన్స్ఫార్మర్ నుండి గ్రామానికి విద్యుత్ సరఫరా అందించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా పలు గ్రామాలలో భారీ వృక్షాలు,పశువుల పాకలు,నేలకోరిగాయి.



