ఆకట్టుకున్న వాలంటీర్లకు వందనం

 

ఆకట్టుకున్న వాలంటీర్లకు వందనం

ఆరుగ్రామాలవాలంటీర్లకుసన్మాన సత్కారాలు

అభినందించినఎమ్మెల్సీ,ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు

వేపాడ మే 25(అఖండ భూమి) :- మండలంలోని సోంపురం, సింగరాయి, ఆతవ సచివాలయాల పరిధిలోని సోంపురం, అరిగిపాలెం, జగ్గయ్యపేట, సింగరాయి, ఆకులసీతంపేట, ఆతవ తదితర గ్రామాలకు చెందిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సింగరాయి గ్రామంలో గ్రామ సర్పంచ్ నిరుజోగి వెంకటరావు అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, జడ్పీటీసీ ఎస్ అప్పారావు, వైస్ ఎంపీపీ అడపా ఈశ్వరావు,జేసీఎస్ కన్వీనర్ బోజంకి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు దుల్ల సన్యాసిరావు, దుల్ల వెంకటరమణ, కేదారి బుల్లిబాబు, ఎంపీడీఓ పట్నాయక్, మండల పంచాయతీ విస్తరణ అధికారి సూర్యనారాయణ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్సులు, సచివాలయం సిబ్బంది పాల్గొని ప్రభుత్వం ప్రకటించిన సేవా రత్న, సేవా వజ్రం, సేవా మిత్ర అవార్డుల పురష్కారంలో భాగంగా మూడు సచివాలయం ల పరిధిలోని వాలంటీర్లందరికి సన్మాన సత్కారాలు చేసి వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ పార్టీలకు వర్గాలకు అతీతంగా అందిస్తున్న సేవల పట్ల పూర్తి సంతృప్తితో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మీపైనే ఎంతో విశ్వాసం కలిగి ఉన్నందున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అదే విశ్వాసాన్ని మీరంతా చూపించి జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎంగా గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకలేకపోయినా పధకాలకు మాత్రం సకాలంలో డబ్బు సమాకూరుస్తూ ప్రజలే దేవుళ్లుగా భావిస్తున్న జగన్ పధకాలను ప్రజలకు వివరించి ఓట్లు రాబట్టే బాధ్యతను వాలంటీర్లు తీసుకోవాలన్నారు. ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ, బదిలీల సమయాల్లో వారికి సన్మాన సత్కారాలు చేసిన మాదిరిగా వాలంటీర్ల సేవలను కూడా గుర్తించి సన్మాన సత్కరాలు చేయడమే కాకుండా నగదు బహుమతులను కూడా అందజేసిన ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు. జడ్పీటీసీ ఎస్ అప్పారావు మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలు అమోఘమని పార్టీకి కూడా నిస్వార్ధంగా సేవలందించాలని కోరారు.అలాగే జేసీయస్ కన్వీనర్ బోజంకి శ్రీనివాసరావు, వైసీపీ నాయకుడు దుల్ల వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ వాలంటీర్లు గృహసారదులను, కన్వీనర్లను కలుపుకొని వెళ్తే చేదోడుగా ఉంటారన్నారు. మళ్ళీ మనప్రభుత్వం తిరిగి అధికారంలోకి తెస్తే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగడమే కాకుండా పర్మినెంట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నారు. అనంతరం వాలంటీర్లు ఎమ్మెల్సీ రఘురాజు, సర్పంచ్ నిరుజోగి వెంకటరావు, ఎంపీడీఓ పట్నాయక్ లను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

 

Akhand Bhoomi News

error: Content is protected !!