ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య
ప్రకాశం జిల్లా కంభం( అఖండ భూమి న్యూస్ ) పట్టణ సమీపంలో బుధవారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మృతుడు కంభం పట్టణానికి చెందిన రామారావుగా (48) పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రస్తుతం కురిచేడులో పూల వ్యాపారం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడని మృతుడు కంభం వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అని పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక నష్టాలతో రామారావు ఆత్మహత్య ఏమైనా చేసుకున్నాడా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.



