బీసీ కులాలను ఎస్టీ జాబితాలో కలిపే అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలి:

 

బీసీ కులాలను ఎస్టీ జాబితాలో కలిపే అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలి: ఆదివాసి జాక్ నాయకులు ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వినతి పత్రం అందించిన ఆదివాసీ జాక్ నాయకులు .

ములుగు జిల్లా ,అఖండ భూమి ప్రతినిధి, మే 25 వెబ్ న్యూస్ :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో 11 బీసీ కులాలను కలిపే తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆదివాసీ ఎమ్మెల్యే ల కార్యాలయాల ముట్టడి లో భాగంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క క్యాంప్ కార్యాలయం ఎదుట ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు నిరసన తెలపడం జరిగింది. తదుపరి ములుగు ఎమ్మెల్యే సీతక్క కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ

అత్యంత వెనుక బాటుకు గురైన వారిలో మేము ఒకరం అని ఎస్టీ జాబితాలో 11 బీసీ కులాలను చేర్చడం మూలాన విద్య,,ఉద్యోగ,ఉపాధి,రాజకీయ రంగాల్లో రిజర్వేన్ల కు దూరమై సంస్కృతి సంప్రదాయాలు,జీవన విధానం కనుమరుగై పోయి వెనుకబడిన వారిని వెనకకి నెట్టే కుట్రను రాష్ట్ర ప్రభుత్వం వేనక్కి తీసుకోవాలని రాబోయే అసెంబ్లీ లో ఈ విషయం పై నా గొంతు వినిపిస్తనని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కబ్బాక శ్రవణ్,మాన్య సీమ నాయకులు గొప్ప వీరయ్య తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు

చింత కృష్ణ,ముద్ద బోయిన రవి

మల్లెల రామ్,రామరావు,సురేష్,సర్వేశ్,బాలరాజు,శ్రవణ్

విష్ణు మూర్తి తో పాటు తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!