ప్రభుత్వ ఉపాధ్యాయుడి 16 వ సారి రక్తదానం.
ములుగు జిల్లా, ఆఖండ భూమి ప్రతినిధి, మే 25.
ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక సేవకుడు ఏటూర్ నాగారంకు చెందిన గజ్జెల సుమన్ హనుమకొండలోని జీవన్ వాలంటరీ బ్లడ్ బ్యాంకులో 16 వ సారి స్వచ్ఛంద రక్తదానం చేయడం జరిగింది. ఇంతకుముందు అనేకసార్లు ఏటూరునాగారం లోకూడా బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో సామాజిక వైద్యశాల లో పలు మార్లు రక్తదానం చేయడంతో, పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయం చేస్తున్న, గజ్జెల సుమన్ ను ఈ సందర్భంగా పలువురు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నేతాజీ పౌండేషన్ అధ్యక్షుడు కొత్తకొండ అరుణ్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు, కైలాసపు సంతోష్ , బొట్టు కమలాకర్ , చెలిమెల్ల అశోక్, అలువల పృథ్వి , మునిగాల రాంప్రసాద్ పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



