బస్కి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్…

బస్కి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్

ముఖ్యఅతిథి గా వంతల త్రినాథ్

రావుఅల్లూరి జిల్లా, అరకువాలీ,27, (అఖండ భూమి) 10 వేల రూపాయలు సెకండ్ ఫ్రాయిజ్ గా బౌకరించారు . ముఖ్యఅతిథిగా వంతల త్రినాథ్ రావు మాట్లాడుతూ

గత నెల రోజులుగా బస్కి పంచాయతీ బస్కి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వహిస్తున్న యువత క్రీడారంగంలో ఉన్న అవకాశాలు ఉపయోగించుకుని భవిష్యత్తులో మంచి పేరు పొందే విధంగా ఆటతోపాటు తమ చదువులు కొనసాగించాలని యువతతో అన్నారు. మీ వయసులో ఉన్న కాలంలో ఆటలో ముందుండి ఉదయపూర్ రాజస్థాన్ లో జరిగిన అంతర్జాతీయ నేషనల్ ట్రైబల్ మీటిలో ఆర్చరీ లో గోల్డ్ మెడల్ వచ్చిందని యువతకు గుర్తు చేశారు. యువతకు భవిష్యత్తులో నా తరఫున సహాయ సహకారాలు ఉంటాయన్నారు .ఆ విధంగా చదువుతోపాటు మంచి అలవాట్లతో భవిష్యత్తులో మన ప్రాంతానికి మార్గదర్శకులై మీరందరూ మెలగాలని అన్నారు. క్రికెట్ తో పాటు ఇతర క్రీడాలు అంటే ఎంతో ఇష్టంగా ఉన్న నాకు మీకు చూడగానే గతాలు గుర్తుకొచ్చాయి అన్నారు.

సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ; క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహిస్తున్న బస్కి దండబాడు క్రికెట్ టీం కి ధన్యవాదాలు తెలియజేస్తూ యువత భవిష్యత్తులో ఆటపాటతో పాటు ఉన్నత స్థాయి చదువులు చదివి మంచి భవిష్యత్తు వైపు సమాజానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు.

స్వాబి డొంబ్రుదార్, మాట్లాడుతూ

యువత క్రికెట్ టోర్నమెంట్ నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు యువత భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు వైపు అడుగు లేయాలని ముందు ముందుకి ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొర్రా ఏలియా బస్కి హెచ్ ఎమ్ శెట్టి అర్జున్, టోర్నమెంట్ నిర్వాహకులు పాంగి బాబురావు, సమర్ధి బుజ్జి బాబు, వంతల గోపాల్ పాంగి కోటేశ్వరరావు వంతల క్రీష్ణ సమర్ధి సభాపతి పాంగి కళ్యాణ్ కొర్రా బల్లి సమర్ది జల్దార్ కిల్లో రాందాష్ కొర్రా నీలకటం కొర్రా దొన్ను ఫైనల్లో చేరుకున్న బస్కి దండబాడు టీం యువకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!