- నవరత్నాలే నవ శకానికి నాంది. ప్రభుత్వ విప్ చిర్ల.
ఆలమూరు (అఖండ భూమి):ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం,ఏ గడప తొక్కినా సీఎం జగనన్నే మాకు భరోసా అంటున్నారు,శంకుస్థాపన చేసిన ప్రతి పనిని పూర్తిచేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల.నవరత్నాలే నవ శకానికి నాంది పలికాయని,ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం పేదల పాలిట వరంగా మారిందని కొత్తపేట శాసనసభ్యులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం వాణిజ్య కేంద్రమైన చెముడులంకలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్,చెముడులంక సర్పంచ్ తమ్మన శ్రీనివాసుతో కలిసి ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిని ఆరాతీశారు.ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.చెముడులంక సచివాలయం-1లో 5 సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.6.88 కోట్లతో నిర్మాణాలు,నవరత్నాల్లో భాగంగా 16 పథకాలకు సంబంధించి రూ.6.38 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.ఎస్సీ కాలనీలో రూ.20 లక్షల రూపాయలతో నిర్మించే ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులం కుంపటి రాజేసిన టిడిపి పాలనలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నడైనా ఇచ్చారా అని మహిళలను ప్రశ్నించారు.అధికార వ్యామోహంతో రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వర్గ విభేదాలు సృష్టించి తద్వారా ప్రయోజనం పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆరోపించారు.పేదలకు మంచి చేయాలని వారు ఎప్పుడైనా ఆలోచించారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.రాష్ట్రంలోని ఏ గడప తొక్కినా జగనన్న పథకాలు తమకు భరోసా కల్పిస్తున్నాయని ప్రజలే చెబుతున్నారని స్పష్టం చేశారు.భవిష్యత్తులో మరింత మేలు జరగాలంటే సీఎం జగనన్నను మరోసారి వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని అన్నారు.
సాయం.. మేము మరిచిపోం..
సీఎం జగనన్న మా కుటుంబానికి అన్ని పథకాలను అందిస్తున్నాడు,ఆయనను మేము మరవం.. మేము ఎప్పుడు జగనన్న వెంటే ఉంటాం.. ఆయన సాయాన్ని ఎన్నటికీ మరిచిపోమని చెముడులంకకు చెందిన తోట ధనమ్మ అనే మహిళ ఎమ్మెల్యే ఎదుట ఆనందం వ్యక్తం చేసింది.
అడుగడుగునా నీరాజనం..
గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి అడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ముఖ్యంగా మహిళలు మంగళహారతులు,కర్పూర నీరాజనాలతో అపూర్వ స్వాగతం పలికారు.ప్రతి ఇంటి వద్ద ఎమ్మెల్యేను దుశ్శాలువాలు కప్పి పూల మాలలతో సత్కరించారు.అంతకుముందు చెముడులంక సెంటర్లో గల రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కాలనీలో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మీద అభిమానంతో చెముడులంక-గాంధీనగరం ఎంపిపి స్కూల్ విద్యాకమిటీ చైర్మన్ బొర్రా వీరబాబు సర్పంచ్ తమ్మన సమక్షంలో ప్రభుత్వ విప్ చిర్లకు దుశ్శాలువా కప్పి పూలమాల వేసి ఇండోర్ ప్లాంట్ ని అందజేసాడు.ఈ కార్యక్రమంలో రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కర్రి నాగిరెడ్డి,వైసిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్తకార్యదర్శి,పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు,ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు,వైసిపి నాయకులు దొండపాటి వెంకటేశ్వరరావు (బులిరెడ్డి),గుణ్ణం రాంబాబు,యనమదల నాగేశ్వరరావు,నాగిరెడ్డి సత్యనారాయణ,అడబాల వీర్రాజు,దొండపాటి చంటి,బుడ్డిగ వీరవెంకట్రావు,దొండపాటి శ్రీను,దూలం పెద తిరుపతిరావు(డిపిటి),రాయుడు వెంకటేష్,మోటూరి సురేష్,తమ్మన హరిహర కుమార్,అడబాల వెంకట్రావు,తమ్మన హరికృష్ణ,బోనం కిట్టయ్య,గొల్లపల్లి విజయ్ కుమార్,ముత్తాబత్తుల చిన్న వెంకయ్య,తంగిడిమిల్లి కిరణ్ కుమార్,గుర్రపు రత్నంరాజు,తోరాటి రాంబాబు,వనుం సూరిబాబు,ఎంపీడీవో జాన్ లింకన్,తాసిల్దార్ ఐపీ శెట్టి,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పోసమ్మ,ఇన్ఛార్జ్ హౌసింగ్ ఏఈ జేజిబాబు,ఈఓపిఆర్ డి రాజ్ కుమార్,పంచాయతీ కార్యదర్శి యు రేణుక,పలువురు అధికారులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



