ఇ.ఎస్.ఐ పథకాన్ని బలోపేతం చేయాలి…. 

రాష్ర్ట కమిటి పిలుపు మేరకు ఈ రోజు కమలాపురంలోని బీడీ కార్మికుల ఆసుపత్రి ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులు రెడ్డి హాజరై మాట్లాడుతూ

కార్మికులకు బీడీ ఆసుపత్రి,నందు ముగ్గురు సిబ్బంది ఉండాలి అందులో మెడికల్ ఆఫీసర్, ఎం. టి.ఎస్. స్టాఫ్ నర్స్, కూడా సెలవుల్లో పెట్టి ఉన్నారు ఇక్కడ ఆస్పత్రి నిర్వహణ పార్ట్ టైం స్వీపర్ మాత్రమే నిర్వహిస్తున్నారు నేను ఒక వేతనము నెలకు ₹2000 మాత్రమే ఇస్తున్నారు

మందులు, పెన్షన్లు, సిక్ వేతనాలు, నిరుద్యోగ భృతి తదితర సౌకర్యాలు కల్పించే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయి. దేశమంతటా ఇ.ఎస్.ఐ పథకాన్ని 2022 కల్లా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ఎక్కడా కనపడని పరిస్థితి నెలకొంది. ఇ.ఎస్.ఐ ఆసుపత్రులు డాక్టర్లు, పరికరాలు, సిబ్బంది మరియు మందులు కూడా లేవు కార్మికుల డబ్బులు రూ. లక్షా 10 వేల కోట్లు రిజర్వు నిధులుగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్కీమ్ను బలోపేతం చేయడానికి సిద్ధపడకుండా ఇ.ఎస్.ఐ పథకాన్ని ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తోంది.

జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో కనీసంగా 30 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదనంగా ప్రతి 20 వేల మంది ఇ.ఎస్.ఐ చందా దారులకు అందుబాటులో | ఉండే విధంగా 30 పడకల ఆసుపత్రులను నిర్మించాలి. ప్రతి 25 కిలోమీటర్ల దూరానికి ఇటువంటి | ఆసుపత్రి నిర్మాణం కావాలని 2019లో తీసుకున్న నిర్ణయం అమలు కావాలి. 2016లో 500 | పడకల ఇ.ఎస్.ఐ ఆసుపత్రి కోసం విశాఖపట్టణంలో శంఖుస్థాపన చేసినప్పటికీ అది ఇంత వరకు ప్రారంభం కాలేదు. విజయవాడ, తిరుపతి నగరాల్లోని ఆసుపత్రులను భవనాలు, ఆధునిక పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది, మందులతో అభివృద్ధి చేయాలి అన్నారు. . సీఐటీయూ జిల్లా కార్యదర్శి అర్ లక్ష్మి దేవి మాట్లాడుతూ అన్ని ఇ.ఎస్.ఐ డిస్పెన్సరీల్లోనూ ల్యాబ్ సౌకర్యాలను కల్పించాలి. డాక్టర్లు మరియు పారా | మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. రిఫరల్ ఆసుపత్రుల్లో ఇ.ఎస్.ఐ చందాదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆసుత్రులకు చెల్లించాల్సిన బిల్లులు రావడం లేదని రోగులను చేర్చుకోవడం లేదు. కొన్ని కేసుల్లో కార్మికులు రిఫరల్ ఆసుపత్రుల్లో చేరినప్పుడు సొంతగా డబ్బులు పెట్టుకోమని ఒత్తిడి వస్తోంది. అలా సొంతగా డబ్బులు పెట్టుకున్న కార్మికులకు ఇ.ఎస్.ఐ వెంటనే బిల్లులను చెల్లించడం లేదు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. సి ఐ టి యు జిల్లా కమిటి సభ్యులుసి. సుబ్బారాయుడు మాట్లాడుతూరాష్ట్ర వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. తన బాధ్యతలను నిర్వర్తించకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం పై నెట్టింది. ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల | బాధ్యతారాహిత్యానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలిఅన్నారు.

ఆటో యూనియన్ జిల్లా నాయకులు ఎం రాజేశ్ మాట్లాడుతూ ఇ.ఎస్.ఐ పథకాన్ని రవాణా కార్మికులకు సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అందరికీ వర్తింపజేయాలి ఈఎస్ఐ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఈ కార్యక్రమంలో సీఐటియూ నాయకులు షామీరు సుబ్బారాయుడు, రమేష్,శ్రీను, సుబ్బారాయుడు, ఆంటోనీ, ఉషరాణి,రేష్మ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!