నరేంద్రమోదీని హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్
న్యూఢిల్లీ మే 26 అఖండ భూమి వెబ్ న్యూస్ :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు శుక్రవారంనాడు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ ఫోన్ కాల్ రావడంతో పోలీసు శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు కునేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసి ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని ప్రసాద్ నగర్‌కు చెందిన ఒకరిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని య్‌గర్ పురకు చెందిన హేమంత్‌గా గుర్తించారు. తప్పతాగిన స్థితిలో అతను ఫోన్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
పీసీఆర్ కాల్ అందగానే ఒక టీమ్‌ను రంగంలోకి దింపామని, కాలర్‌ను కరోల్ బాగ్‌కు చెందిన 48 ఏళ్ల హేమంత్ కుమార్‌గా గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి గత ఆరేళ్లుగా నిరుద్యోగిగా ఉన్నాడని, తాగుడు అలవాటు ఉందని చెప్పారు. కాగా, మరిన్ని విషయాలు తెలియాల్సి ఉన్నాయి….
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



