మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనాలను ప్రారంభించిన: మంత్రి సత్యవతి రాథోడ్.
ములుగు,మే 26, అఖండ భూమి ప్రతినిధి వెబ్ న్యూస్ :
కన్నాయిగూడెం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయం భవనాన్ని , ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ములుగు శాసన సభ్యురాలు
ధనసరి అనసూయ సీతక్క, ట్రై కార్ ఛైర్మెన్ రాంచెంద్రు నాయక్, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ వాల్య నాయక్, ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలా త్రిపాఠి, జెడ్పి వైస్ చైర్మన్ బడే నాగజ్యోతిలతో కలసి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో మంత్రి
కేక్ కట్ చేసి, జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా యంత్రాంగం ను, వైద్య సిబ్బంది నీ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, డిఆర్ఓ కే రమాదేవి, జడ్పీ సిఈ ఓ ప్రసూన రాణీ, డిఅండ్హెచ్ఓ డాక్టర్ అప్పయ్య, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ వలియ బి, జడ్పిటిసి నామ కరం చంద్ గాంధీ, ఎం పీ పి జనగాం సమ్మక్క, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హేమలత, మండల ప్రత్యేక అధికారి డిపిఓ వెంకయ్య , తహసిల్దార్ ఇంఛార్జి రామ్ సింగ్ , ఎంపిడి ఓ ఫనిచంద్ర, సర్పంచ్ చిదరి మౌనిక, సంబంధింత అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l
నవీన్ యాదవ్ విజయమే ప్రజా ప్రభుత్వానికి దీవెనలు….



