కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
ములుగు జిల్లా ,అఖండ భూమి ప్రతినిధి ,మే 26.
మండలంలో పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్.
ములుగు జిల్లాను పర్యట ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి చేస్తుంది-సత్యవతి రాథోడ్..
రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ అభివృద్ది పనులలో భాగంగా బాలన్నగూడెంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 63 లక్షల 65 వేలతో ఏర్పాటు చేసిన మౌలిక వసతుల అభివృద్ధి పనులను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని 16 లక్షలతో నిర్మించిన రెవెన్యూ అతిథి గృహ భవనమునమును, గంపోనిగూడెంలో ప్రభుత్వ గిరిజన ఫిల్లింగ్ స్టేషను, రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆదివాసి సమ్మక్క సారలమ్మ చిల్లి ప్రాసెసింగ్ యూనిట్ ను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, గ్రామాలలో, పట్టణాల్లో వందేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, జూన్ మొదటి వారంలో కేటీఆర్ చేతుల మీదగా ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు, గత ప్రభుత్వాలు, పార్టీలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి చేసుకునే వాళ్ళు, కానీ కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రత్యేక ప్రేమతో ములుగు జిల్లాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం 7,289 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద కేజీ టూ పీజీ ఉచిత విద్య, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య అందుబాటులోకి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.జూన్ 24 నుండి 30 తేదీ వరకు పొడు పట్టాలు అందించబోతున్నాం.అనంతరం స్వంత ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకొనేందుకు వ్యక్తి గత గృహ నిర్మాణ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తుందని, దశాబ్ది ఉత్సవాల్లో ములుగు జిల్లా అభివృద్ధిని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ట్రై కార్ ఛైర్మెన్ రాంచెంద్రు నాయక్, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ వాల్య నాయక్, ఐటీడీఏ పీవో అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలా త్రిపాఠి, జెడ్పి వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి జిల్లా గ్రంధాలయ చైర్మన్ గోవింద నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, డిఆర్ఓ కే రమాదేవి, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత, మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి, డి. డ బ్లు ఓ ప్రేమలత, మండల తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాద్యాయులు, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



