కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష జరిపిన ఎమ్మెల్యే వనమా
పాల్వంచ మే 27 (అఖండ భూమి )కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ ,లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే వనమా ఆదేశించారు.
పాత పాల్వంచలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో పంచాయతీ పనులను వెంటనే చేపట్టాలన్నారు. ప్రతి పంచాయతీకి స్పెషల్ ఫండ్స్ కింద సీఎం కేసీఆర్ పది లక్షలు కేటాయించారన్నారు. స్పెషల్ ఫండ్స్ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఎమ్ ఎన్ ఆర్ ఈ జి ఎస్ వర్క్ లపై చర్చించారు.వేసవి దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి పంచాయతీరాజ్ డిఇ వేణుగోపాల్, ఏఈలు సేవాలాల్, అనిల్, నాగేందర్, ఎంపీడీవోలు రమేష్, అప్పారావు, విజయలక్ష్మి, మంగమ్మలు, ఎంపీవోలు జి సత్యనారాయణ, ఖాన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



