భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం.

 

భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం.

అరకు అసెంబ్లీ కో కన్వీనర్ గా శెట్టి రాజు నియామకం.

అల్లూరి జిల్లా; అనంతగిరి ( అఖండ భూమి)మండలంలోని టోకూరు పంచాయితీ ములియగూడ జంక్షన్ లో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు అధ్యక్షతన అరుకు అసెంబ్లీ కో కన్వీనర్ గా శెట్టి రాజు ను నియమించడం జరిగింది. కార్యక్రమంలో కో కన్వీనర్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన వంతు శ్రయా శక్తుల కృషి చేస్తానని, మండలంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టి కృషితో పార్టీ గెలుపునకు విజయం వైపు పయనించాలని కార్యకర్తలు అందరికి తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు మాట్లాడుతూ కార్యవర్గ సమావేశంలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోధి ఘనతను వాడవాడలా గ్రామ గ్రామాల్లో చాటి చెప్పేందుకు కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ అందరికీ అవగాహన పరచాలని తెలియపరిచారు. కార్యక్రమంలో యువ మోర్చా ప్రధాన కార్యదర్శి సమరెడ్డి రామస్వామి, ఉపాధ్యక్షులు సిహెచ్ సింహాద్రి, గిరిజన మోర్చా అధ్యక్షులు పాంగి నాగేశ్వరరావు, మండల నాయకుడు వంతల అప్పన్న, మహిళా మోర్చా అధ్యక్షురాలు సాగర రాజేశ్వరి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!