సస్పెన్షన్ కు గురైన అటవీ శాఖ అకాధికారిని…?
రాజవొమ్మంగి, అఖండ భూమి,ఏప్రిల్ 27: అడ్డతీగల రేంజ్ అటవీ శాఖ అధికారినిగా పనిచేస్తూ, ఈనెల 24వ తేదీన లంచం తీసుకుంటూ అవనీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కి సస్పెన్షన్ గురైన డి.లలిత కుమారి ఉదoతమిది. అటవీ శాఖ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రేంజ్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు లంచం తీసుకుంటూ చిక్కి సస్పెన్షన్ గురయ్యారని తెలిపారు. రంపచోడవరం ఇంచార్జి రేంజ్ ఆఫీసర్ గా ఉంటూ 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కి సస్పెన్షన్ గురయ్యారని తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో అటవీశాఖ అధికారుని గా పని చేస్తూ సస్పెన్షన్ గురయ్యారని తెలిపారు. రేంజ్ ఆఫీసర్ గా ఉంటూ ఆ రేంజ్ పరిధిలో రక్షిత అటవీ ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో అనుమతులు లేకపోయినా అక్రమ కలప రవాణాకు సహకరిస్తూ తన పదవికే ముప్పు తెచ్చుకున్నారని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తల్లి చేలో మేస్తే, దూడ గట్టునమేస్తుందా అనే చందంగా అధికారులు ఉండడంతో క్రింది స్థాయి సిబ్బంది అంకిన వరకు దోచుకుంటున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. ఇకనైనా పై స్థాయి అధికారులు స్పందించి రక్షిత అటవీ ప్రాంతాన్ని, వందల ఏళ్ల వయసున్న వృక్షాలను కాపాడగలరని స్థానికులు కోరుతున్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



