దివి నుండి భూమికి తీసుకువచ్చిన మహనీయుడు మహర్షి డు

దివి నుండి భూమికి తీసుకువచ్చిన మహనీయుడు మహర్షి డు

 

 

– జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

భీమవరం.ఏప్రిల్ 27, అఖండ భూమి ఒక లక్ష్యం నిర్దేశించుకుని ఆ లక్ష్యం సాధించడం కోసం ప్రయత్నం చేయడం ద్వారా మంచి సమాజం ఏర్పరచు కోవచ్చునని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి అన్నారు. గురువారం శ్రీ భగీరథ మహర్షి జయంతి మహోత్సవము సందర్భంగా జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన శ్రీ భగీరధ మహర్షి జయంతి మహోత్సవము కార్యక్రమానికి జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ గంగా జలాలను దివి నుండి భూమికి తీసుకువచ్చిన ఘనత భగీరథుడికి దక్కుతుందని కలెక్టరు అన్నారు. భగీరథుడు మహా జ్ఞాని ,పరోపకారానికి పెట్టింది పేరని, దీక్షకు, సహనానికి ప్రతిరూపమని , ఎంత కష్టమైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించారని ఆమె అన్నారు. ఎవరైనా కఠోర శ్రమ చేసి దేన్నైనా సాధిస్తే దానిని భగీరథ ప్రయత్నం చేశారని అంటారని కలెక్టరు తెలిపారు. కష్ట సాధ్యమైన మైన పనిని సాధించాలంటే భగీరథుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె సూచించారు. ఇలాంటి వ్యక్తుల ద్వారా మనం స్ఫూర్తిని పొంది ముందుకు సాగాలని కలెక్టరు సూచించారు. మనకంటే ముందున్న వారితో పోటీ పడి విజయం సాధించాలనీ ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం భగీరథుడు జయంతి అధికారికంగా ప్రక టించిందని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి తెలిపారు.

 

డి ఆర్ ఓ కె. కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం నిర్దేశించుకొని అది ఎంత కష్టమైనా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే విధంగా ముందుకు వెళ్ల డమే అపర భగీరథుని ప్రయత్నం అంటారని ఆమె అన్నారు.పట్టు పట్ట రాదని పట్టుపడితే విడవరాదని అనుకున్న లక్ష్యాలు చేరుకునే విధంగా అది ఎంత కష్టమైన వదలకుండా ప్రయత్నం చేయాలని ఆమె అన్నారు . భగీరథుడు మంచి జ్ఞాని అని ఇతరులకు సహాయపడే వ్యక్తి అని భగీరథుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని డి ఆ ర్ఓ కె. కృష్ణ వేణి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ దాసి రాజు , వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జి.గణపతి రావు , జిల్లా అధికారులు,ఇతర నాయ కులు , విద్యా ర్థిని,విద్యార్థులు, తది తరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!