పేరుకుపోతున్న ధాన్యం నిలువలు, పట్టించుకోని ప్రభుత్వం: బొల్లు దేవేందర్.
ములుగు జిల్లా, అఖండ భూమి వెబ్ న్యూస్ :
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ అన్నారు.మండలంలోని 18 గ్రామపంచాయతీ పరిధిలో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు లారీలు రాక పేర్కపోయి కొనుగోలు కేంధ్రంలోనే ధాన్యం బస్తాలతోనే పడిగాపులు పడవలసిన పరిస్థితి ఉంది అన్నారు. రైతు ప్రభుత్వం మాది అనే పాలకులకు,లారీలు సమకూర్చాలనే ఆలోచన ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నించారు. గతంలోనే తూకాలు వేయక, వేసినా లారీలు సప్లైచేయక,వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి రైతులు చాలా నష్టపోయారు అన్నారు. మల్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ధాన్యాన్ని తరలించేందుకు లారీలను సమకూర్చాలని కోరారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



