గుమ్మిలేరు గ్రామంలో వైభవంగా జరిగిన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి కళ్యాణోత్సవం.
ఆలమూరు (అఖండ భూమి):డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు.గుమ్మిలేరుకు చెందిన రెడ్డి వెంకట్రావు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ ఉత్సవాలలో భాగంగా ముందుగా గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ ఆచార్యులు పర్యవేక్షణలో వేద పండితులు స్వామివారి కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు.కళ్యాణ ఉత్సవాలలో చుండ్రు వెంకట శివప్రసాద్ లావణ్య దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు.కళ్యాణోత్సవాలు తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో రెడ్డి వెంకట్రావు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



