జగనన్న పాలనలో ప్రతి గడపలోను వెలుగులు
పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి
కొయ్యూరు అటెండ భూమి వెబ్ న్యూస్ :
మే 31 అల్లూరు జిల్లా
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి గడపలోను వెలుగులు నింపారని పాడేరు శాసనసభ్యురాలు కే భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలో నడింపాలెం గ్రామ సచివాలయ పరిధిలో గల పెదమాకవరం, కత్తి రాళ్లలోది గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆమె ఈ సందర్భంగా 196 గడపలను సందర్శించారు సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధి పొందుతున్న వారిని పలకరిస్తూ ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు దీంతో ఆమె దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను విని వెంటనే పరిష్కరించారు ఆర్థికపరమైన వాటితో ముడిపడి ఉన్న సమస్యలు పరిష్కారానికి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ నాలుగేళ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాల గిరిజనులు ఎస్సీలు ఇలా ప్రతి ఒక్కరికి ప్రయోగినాలు చేకూర్చాయని అని తెలిపారు సంక్షేమ పథకాలు రూపంలో ఆర్థికంగా బలోపేతమైనందుకు అవకాశం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి గా కాకుండా తమ కుటుంబంలో ఆ అన్నగా తమ్ముడుగా కుటుంబ పెద్దగా మామయ్యగా వారి కుటుంబ సభ్యులుగా మారిపోయారని అని తెలిపారు ఈ నాలుగు సంవత్సరాలు కాలంలో సంక్షేమానికి అభివృద్ధికి సమ ప్రాధాన్యతిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సెగ్గే నూకాలమ్మ ఎంపీటీసీలు మల్లేశ్వరి అప్పారావు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు రాజకుమారి ఎంపీపీ బడుగు రమేష్ జడ్పిటిసి వారా నూకరాజు ఏఎంసీ చైర్మన్ బీసీ డైరెక్టర్ గాడి నాగమణి వైఎస్ఆర్సిపి నాయకులు గాడి సత్యనారాయణ వైస్ ఎంపీపీలు అప్పన్న వెంకటరమణ అంబటి నూకాలమ్మ మండల కన్వీనర్ బండి సుధాకర్ అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు గ్రీవెన్స్ సెల్ ఉపాధ్యక్షులు గొడ్డేటి మహేష్ జిల్లా ప్రసార కార్యదర్శి ధోని బాబ్జి ట్రైకార్ డైరెక్టర్ పాల్గొన్నారు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…