నారా లోకేష్ ని కలిసిన సర్పంచ్ … రాముల విజయ్
తుగ్గలి ఏప్రిల్ 27 (అఖండ భూమి) :
మంత్రాలయం నియోజకవర్గంలో జరుగుతున్న యువ గళం పాదయాత్ర లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మండల టిడిపి నాయకుడు, ఎద్దులదొడ్డి సర్పంచ్ రాముల విజయ్ గురువారం కలిశారు. మంత్రాలయం నియోజకవర్గం లో జరుగుతున్న యువ గళం పాదయాత్ర లో ఎద్దులదొడ్డి గ్రామానికి చెందిన టిడిపి మండల నాయకుడు, సర్పంచ్ రాముల విజయ్ నారా లోకేష్ ను కలిసి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని వివరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాముల విజయ్ మాట్లాడుతూ నారా లోకేష్ ను కలసి పలు సమస్యలను వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నిధులను తమకు ఇవ్వకుండా తమలను ఇబ్బందులు గురిచేస్తున్నారని నారా లోకేష్ కు వివరించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ పనులు చేయించేందుకు అప్పుచేసి వాటికి ఖర్చు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు.అంతేకాక రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేక, పంట సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులపై విపరీతమైన ధరలను ప్రభుత్వం పెంచిందని ఆయన తెలిపారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



