పాఠశాలలు పునః ప్రారంభానికి అధికారులు హామీ. తుగ్గలి

పాఠశాలలు పునః ప్రారంభానికి అధికారులు హామీ. తుగ్గలి

ఏప్రిల్ 27 (అఖండ భూమి) : మండలంలో గత టిడిపి ప్రభుత్వంలో మూతపడిన పాఠశాలలను పునః ప్రారంభించేందుకు జిల్లా అధికారులు హామీ ఇచ్చినట్లు జడ్పిటిసి పులికొండ నాయక్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2015 సంవత్సరం లో తుగ్గలి బీసీ కాలనీ, రాతన కొత్తూరు, రోల్లపాడు గ్రామాలలో ఉండే ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం ముయించి వేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. దీంతో మూతపడిన పాఠశాలలను పునః ప్రారంభించాలని వారు జిల్లా విద్యాశాఖ అధికారికి తెలిపారని, దీంతో విద్యాశాఖ అధికారి 2023- 24 విద్యాసంవత్సరానికి మూతపడిన మూడు పాఠశాలలను పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అందువల్ల ఆయా ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పునః ప్రారంభించే పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!