ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం
తుగ్గలి ఏప్రిల్ 27 (అఖండ భూమి) :
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనే ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని తుగ్గలి సచివాలయ కన్వీనర్ వన్నూరు బి అన్నారు.గురువారం తుగ్గలి లో మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె గృహసారథులు, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాలను వివరించారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందలేదా అని ఇంటింటికి వెళ్లి తెలుసుకున్నారు. దీంతో గ్రామస్తులంతా తమకు నవరత్నాల పథకాలన్నీ అందాయని వివరించారు. ఈ సందర్భంగా వన్నూరుబి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంపన్న వర్గాలు లబ్ధి పొందారని, అయితే జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడు కు రూ లక్ష నుండి రూ 5 లక్షల దాకా జగనన్న ఇవ్వడం జరిగిందన్నారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికలలో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యే శ్రీదేవమ్మను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుటకు ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గృహసారథులు ప్రతాప్, సుశీల, వాలంటీర్లు చంద్రిక, రాము తదితరులు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



