ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పత్తికొండలలో ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు.

 

 

కర్నూలు జిల్లా అఖండ భూమి భూమి వెబ్ న్యూస్ :

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పత్తికొండలలో ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు.

వైఎస్సార్‌ రైతు భరోసా ఆర్ధిక సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు 9 గంటలకు చేరుకున్నారు.

అనంతరం ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో 9:15 గంటలకు పత్తికొండకు బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా పత్తికొండకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. . అనంతరం అక్కడి నుంచి కాన్వాయ్ లో

వైఎస్సార్‌ రైతు భరోసా ఆర్ధిక సాయం పంపిణీ చేసేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

చంద్రబాబు రైతు వ్యతిరేకి

చంద్రబాబు ఓ రైతు వ్యతిరేకి అని, ఆయనకు విలువలు, విశ్వసనీయత లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండలో వ‌రుస‌గా ఐదో ఏడాది తొలి విడత వైయ‌స్ఆర్‌ రైతు భరోసా,పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడుస్తాడన్నారు. రైతుకు చంద్రబాబు శత్రువు అన్నారు. రాజమండ్రిలో మహానాడు పేరుతో డ్రామా చేశారన్నారు. ఆ మహానాడు డ్రామాకు ముందు ఒక ప్రకటన చేశారన్నారు. అది చూస్తే అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరకు వచ్చిన మారీచుడు గుర్తొచ్చాడన్నారు. సీతమ్మ దగ్గరకు భిక్షగాడి రూపంలో వచ్చిన రావణుడు గుర్తొచ్చాడన్నారు. చంద్రబాబు సత్యాన్ని పలకరు.. ధర్మానికి కట్టుబడరన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంపేసి.. మళ్లీ ఆయన్నే కీర్తించారన్నారు.

చంద్రబాబుకు ఒరిజినాలిటీ లేదని, పర్సనాలిటీ లేదని, క్యారెక్టర్ లేదని, క్రెడబులిటీ అంతకన్నా లేదని సీఎం జగన్ అన్నారు. పోటీ చేసేందుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేరన్నారు. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతారని, ఏ గడ్డైనా తింటారన్నారు. చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు అని జగన్ అన్నారు. మరో ఛాన్స్ ఇవ్వండి ఏదో చేసేస్తా అంటున్నాడని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకునే ధైర్యం లేదని జగన్ అన్నారు. సీఎంగా మొదటి సంతకానికి ఒక క్రెడబులిటీ ఉంటుందన్నారు. కానీ చంద్రబాబు మొదటి సంతకాన్నే మోసంగా మార్చేశారన్నారు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని సీఎం జగన్ అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!