భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వై.ఎస్.భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ వాయిదా పడింది..
విచారణను న్యాయస్థానం ఈనెల 5కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను కోర్టు ఆదేశించింది. భాస్కరరెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
”సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో నా పాత్రకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవు. సాక్ష్యాల చెరిపివేతలో నాకు ఎలాంటి సంబంధంలేదు. ఎలాంటి ఆధారాలూ లేకపోయినా నన్ను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారు. అంతేకాకుండా నా ఆరోగ్యం సరిగా లేదు” అని భాస్కరరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో కుట్రతోపాటు సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాల చెరిపివేతలో కీలక పాత్ర పోషించారంటూ భాస్కరరెడ్డిని సీబీఐ ఏప్రిల్ 16న అరెస్టు చేసింది..
మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్ రెడ్డి సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. కేసు విచారణను సీబీఐ కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది..
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…



