మలేరియా వ్యాధిపై అవగాహన సదస్సు

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం
కొరుప్రోలు గ్రామంలో మలేరియా నివారణ మాసో ఉత్సవాలు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వెల్నెస్ సెంటర్ పర్యవేక్షకులు షేక్ అమీర్ షాజిద్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మలేరియా గురించి అవగాహన ఉండాలని ఎన్. వి. బి డి సి పి నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం జాతీయ కీటక జంట వ్యాధి నియంత్రణ కార్యక్రమం దోమలకోట ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా ఆడ నా ఫిలస్ దోమ ద్వారా ఏర్పడుతుంది డెంగ్యూ (ఆడ ఏడిస్ దోమ) ద్వారా ఏర్పడుతుంది (చికెన్ గున్యా) ఆడ దోమ ద్వారా ఏర్పడుతుంది ( ఫైలేరియా బోధ వ్యాధి) ఆడ క్యులెక్స్ దోమ ద్వారా ఏర్పడుతుంది వీటిని నివారించడానికి ముఖ్యంగా మూడు పద్ధతులు ఒకటి దోమలు పుట్టకుండా అదుపు చేయడం రెండు దోమలు కుట్టకుండా చూసుకోవడం మూడు దోమ కాటు గురైతే సరైన మందులు తీసుకోవడం ప్రైడే డ్రైడే కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ వివరంగా తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో దోమలు నిల్వ ఉన్న నీటితోనే గుడ్లు పెడతాయి ఈ గుడ్లు సుమారు 8 నుండి పది రోజుల్లో పెద్ద దోమలుగా పెరుగుతాయి పెద్ద దోమల్ని మనం నాశనం చేయలేము కనుక వారానికి ఒకసారి అంటే ప్రతి శుక్రవారం నెలల నీటిని పారబోయడం ద్వారా దోమలు పెరుగుదలని అరికట్టవచ్చు నీటిలో ఉన్నప్పుడే అరికట్టవచ్చు దోమల పుట్టరాదు దోమకుట్ట రాదు ఇంటి కీటకాలకు తలుపులు దగ్గర లెట్రిన్ వెంట పైపులకు మెస్ వైర్లు ఏర్పాటు చేసుకోవాలి దోమ కాటుకు గురికాకుండా దోమ తెరల్లో నిద్రించడం రేప్ లైoట్స్ వాడటం సాయంత్రం ఐదు నుండి 6 గంటల సమయంలో తలుపులు కిటికీలు మూసివేయాలి వేప ఆకుల పుగను వాటికి చూపించాలి పొడవాటి చేతులు కలిగిన శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా లేత రంగు దుస్తులు ధరించడం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే లోతట్టు ప్రాంతాలు లేకుండా చూడటం త్రాగునీరు నీళ్ళు పై మూతలు ఉంచడం వాడుకలో లేని కంటైనర్లను బోర్లించి ఉంచటం వారంకు ఒకసారి నిలవనీటీని పారబోసి శుభ్రపరిచి సేపు ఎండలో ఉంచి మరలా నింపుకోవాలి. ఒకవేళ ఆ నీరు అవసరం అనుకుంటే ఒక శుభ్రమైన గుడ్డతో వేరొక పరిశుభ్రమైన పాత్రలోకి వడబోయవలెను నీటి తొట్టెలను నీటి ట్యాంకులను శుభ్రంగా చేసుకోవడం మురికి నీటి నిలవడం మురికి కాలంలో వారానికి ఒకసారి వేస్ట్ ఆయిల్ లేదా కిరోసిన్ వేయాలి ఇంటి పరిసరాల్లో పనికిరాని పగిలిపోయిన వాడను వస్తువులు తాగేసిన కొబ్బరి బొండాలు టీ కప్పులు పాత టైర్లు మొదలైనవి లేకుండా చూసుకోవాలి వర్షపు నీరునీల ఉండకుండా చూడాలి గుడ్లు పెట్టే అవకాశం లేకుండా చేయాలి అంతేకాక వేపాకు పొగ వేయవచ్చు బంతి తులసి పుదీనా లావండర్ క్రోస్ మీరు వంటి మొక్కలను పెంచుకొనుటకు వలన వాటి నుండి వచ్చే ఘాటైన వాసనకు దోమలు ఇంటిలోనికి ప్రవేశించకుండా అరికట్టుకోవచ్చు (ఎబేట్- టె మీఫాస్ అనే డింభక్ నాశని)తో దోమ లార్వాను నశింపజేయు విధానం ముందుగా స్టాక్ సొల్యూషన్ తయారు చేసుకోవాలి. ఒక లీటర్ మంచినీటిని ఒక బాటిల్ లోకి తీసుకుని దానిలో ఎబిట్ ను 2 ml కలిపి బాటిల్ బాగా షేక్ చేస్తే పాలు లేదా మజ్జిగ లాగా తెల్లటి రంగులోకి మారుతుంది దీనిని స్టాక్ సొల్యూషన్ అంటారు ఎక్కడైనా మీరు నీల ఉండి దానిలో దోమ తర్యాలను గమని స్తే ఆ నీటి పరిమాణాన్ని బట్టి ఒక లీటర్ నీటిని 2 ml చొప్పున తో తయారు చేసిన స్టాక్ సొల్యూషన్ కలపాలి. దీని వలన దోమలు అభివృద్ధిని నీటి దశ అక్వాటిక్ స్టేజ్ లోనే అరికట్టవచ్చు ఒక్కసారి తయారు చేసే స్టాక్ సొల్యూషన్ అదే రోజు ఉపయోగించాలి మరుసటి రోజు వాడరాదు అదే ఉపయోగించాలి అని వివరించడం జరిగింది డెంగ్యూ వ్యాధి నిర్ధాణ పరీక్షలు (ఎలీ సాటెస్ట్ )ఎన్టీఆర్ ఆసుపత్రి అనకాపల్లిలో ఉచితంగా చేస్తారని చెప్పడం జరిగింది కార్యక్రమంలో ఉండాలి, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కే .గోపాలం మరియు ఎం ఎల్ హెచ్ పి_ఆశ, ఏ ఎన్ ఎం లక్ష్మి, ఆశ కార్యకర్తలు సత్యవేణి, గ్రామ పెద్దలు తదితరులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు, అలాగే హెల్త్ వెల్నెస్ సెంటర్ ను గ్రామం లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న వ్యాధుల బారిన పడిన వారు కూడా సద్వినియోగ పరుచుకోవలసిందిగా హెల్త్ వెల్నెస్ సెంటర్ పర్యవేక్షకులు షేక్ అమీర్ షాజిద్ కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!