సామాజిక సేవలో ఆదర్శంగా నిలుస్తున్న శ్రీను కి ఘన సన్మానం!
కాకినాడ జూన్ 12 (అఖండభూమి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమగ్ర విద్యా అభివృద్ధి మరియు గ్రామీణాభివృద్ధి రంగాల్లో ప్రత్యేక అవసరాలు మరియు అంధ విద్యార్థులకు నిరంతరంగా, అహర్నిశలు సేవలందిస్తూ సామాజిక సేవలో తనదైన ముద్ర వేసుకుంటున్న శ్రీ శ్రీను మాసా గారికి ఘనమైన గౌరవం దక్కింది.కాకినాడ ఎంపీ శ్రీ ఉధయ శ్రీనివాస్ గారు, శ్రీను గారి సేవలను ప్రత్యేకంగా గుర్తించి, జనం మధ్య ఆయన కృషిని ప్రశంసిస్తూ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, గ్రామీణాభివృద్ధి కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీను గారి సేవలు ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్య మరియు ఆత్మనిర్భరతకు దోహదపడేలా రూపొందినవని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. వారి సోదరి కొండ్రు రవణమ్మ మాట్లాడుతూ ఈ గౌరవం మా కుటుంబానికి గర్వకారణంగా నిలిచిందని, ఆయన సేవలు ఇంకా ఎంతో మందికి ప్రేరణగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు



