కోటనందూరు ( అఖండ భూమి జూలై 2):
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం హట్టహాసంగా ముందుకు సాగుతోంది. కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని అమలు చేసిన సంక్షేమ పథకాలను కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం తెలుగుతమ్ముళ్లు ప్రతీ ఇంటికి వెళ్లి వివరించారు.. ఏడాది కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య పాలనను, గత పాలనలో జరిగిన రాక్షస పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలు గమనించాలని ప్రజలను కోరారు. పార్టీ శ్రేణులు తో కలిసి కరపత్రాలు పంచుతూ నిర్వహించిన ఈ ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

ANDHRA BREAKING NEWS HEALTH NEWS PAPER

