సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య
తుని నియోజకవర్గం, జూలై 2 (అఖండ భూమి).
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇవాళ తుని పట్టణంలోని వీరవరపుపేట లో ఇంటింటికి తెలుగుదేశం దేశం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అలుపెరగని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ కు కార్యరూపం ఇస్తున్నారని అన్నారు.ఎమ్మెల్యే యనమల దివ్య తెలుగుదేశం పార్టీ కార్యవర్గం మరియు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి ఇంటికి వెళ్ళిన ఎమ్మెల్యే యనమల దివ్య కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించారు.పధకాలు
క్షేత్ర స్థాయిలో అందుతున్న తీరుపై ఆరా తీసిన ఆమె అందరి సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతంనీడి అబ్బాయి, సుర్ల లోవరాజు, యనమల రాజేష్, మోతుకూరి వెంకటేష్,మల్ల గణేష్,తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ నార్ల భువన సుందరి, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాత బాబు,రామచంద్ర రాజు, స్థానికులు బోడపాటి అప్పారావు, కూరపాటి రఘు, బోడపాటి శ్రీను,ఆరుగుల కృష్ణ,జల్లు వాసు,పులి సత్తిబాబు,కాకాడ జ్యోతికుమార్ పెదపూడి శివ, గోవిందు,బోడపాటి కిరణ్,జనసేన శివ,బోడపాటి గణేష్ తదితరులు పాల్గొన్నారు.