గర్భిణులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలి…

అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలి…

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 2 (అఖండ భూమి న్యూస్);

అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీలకు నాణ్యతతో కూడిన పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని మాత్రమే అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. మహిళ , శిశు అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మహిళా, శిశు సంక్షేమ శాఖ పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముందు శ్యామ్, మామ్ పిల్లల శాతం అంగన్వాడీల వారీగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో ఉన్న పౌష్టికాహారలోప పిల్లలకు ప్రత్యేక పౌష్టికాహారం అందించి క్రమం తప్పకుండా వారి ఎత్తు బరువులు కొలిచి వారు ఆరోగ్యవంతమైన పిల్లలుగా ఎదిగేల చర్యలు తీసుకోవాలి అన్నారు. వర్షాకాలం వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున అంగన్వాడి పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ వేడి ఆహార పదార్థాలను అందించాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలను విసిట్ చేసేటప్పుడు చిన్నారులు హాజరు శాతం తక్కువగా ఉంటుందని ఇకనుండి అంగన్వాడి కేంద్రాల్లో రిజిస్టర్ అయిన పిల్లలందరూ తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు వచ్చేలా జిల్లా సంక్షేమ అధికారి, సిడిపిఓలు, సూపర్వైజర్లు ప్రతిరోజు అంగన్వాడి కేంద్రాలను విజిట్ చేయాలని అలాగే అంగన్వాడి కేంద్రాల్లో గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావాలని అన్నారు.

అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి భవనాల నిర్మాణం మరియు వాటర్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ మొదలగు పనుల గురించి చర్చించి ఆయా నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. వివిధ సందర్భాలలో గృహహింసకు గురైన మహిళలకు సఖి కేంద్రం ద్వారా సేవలు అందించాలని, అనాధ పిల్లల దత్తత, వివిధ సందర్భాల్లో రిస్కు చేసిన బాలలకు సంరక్షణ చర్యలు తీసుకోవాలని, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లో చిన్నారులకు సౌకర్యాలు మెరుగుపరచాలని, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, డి ఎం అండ్ హెచ్ వో చంద్రశేఖర్, ఈ ఈ పిఆర్, విద్యుత్తు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు,సిడిపిఓ లు, సూపర్వైజర్లు, మహిళా మరియు శిశు సంక్షేమశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!