గునుపూడిలో జనంకోసం జనసేన

నాతవరం మండలం గునుపూడి లో ఇంటింటా జనసేన పార్టీ నిర్వహించే జనంకోసం జనసేన కార్యక్రమాన్ని నాతవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెలగా వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా మన్ననలు పొందుతున్న ఆ పార్టీ నాయకులు నర్సీపట్నం జనసేన పార్టీ ఇంచార్జి రాజాన వీర సూర్యచంద్ర హాజరయ్యారు గ్రామం లోని ప్రజలు మహిళలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు తమ సమస్యలను సూర్యచంద్ర కి తెలియజేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గునుపూడి గ్రామంలో మంచినీరు లో ఫ్లోరిన్ లాంటి రసాయన మూలకాలు ఉండడం వల్ల మొత్తం కలుషితమైన కారణంగా ప్రజలు ఎముక సంబంధిత వ్యాధులు మోకాలు కీళ్లు నొప్పులే కాకుండ బ్యాక్టీరియల్ జ్వరాలు టైపాయిడ్ లాంటి అనేక వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారని చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు వైద్య సహాయ నిమిత్తం ఇక్కడ ఉన్న ఆసుపత్రి ని 30 పడకలకు పెంచి అన్ని సౌకర్యాలు కల్పించాలని వీరసూర్యచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్షల కోసం గ్రామం లో ఆసుపత్రి ఉన్నా నర్సీపట్నం వెళ్లి చేసుకోవలసి వస్తుందని ల్యాబ్ టెక్నీషియన్ లు ఉన్నా ఆ సేవలు ఎందుకు అందటం లేదని ఆయన ప్రశ్నించారు అంతేకాకుండా ఈ గ్రామంలో ప్రజలకు ఆరోగ్య పరిస్థితి విషమించి నప్పుడు సుమారు 40 కిలోమీటర్లు దూరం ప్రయాణించి నర్సీపట్నం రావలసి ఉంటుందని అంతలోనే వైద్యం దూరమై మృత్యువు కాటేస్తుందని ఇలా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు సంక్షేమం అంటే మద్యం దుకాణాలు అభివృద్ధి కాదని విద్య వైద్య సేవలు అభివృద్ధి అని ఎద్దేవా చేశారు ఉన్న ఆసుపత్రి నే 30 పడకల ఆసుపత్రి గా వసతి కల్పించినట్లయితే ఈసమస్యలను పరిష్కరించవచ్చునని సూర్యచంద్ర అన్నారు ఈ సమస్యలను పరిష్కరించలేని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు ఈ నాలుగేళ్లలో ఈ గ్రామంలో ప్రజలకు ఎన్ని ఇల్లు ఇచ్చారో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నిరూపించడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు అదే విధంగా పశువులు కు కూడా సరైన పశువైద్యశాల పశువైద్యులు లేక పాడిరైతులు పడే ఇబ్బందులు సమస్యలు గురించి తెలుసుకున్నారు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన బరోసా ఇచ్చారు నర్సీపట్నం శాసనసభ్యులు ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాతవరం మండలం యూత్ అధ్యక్షులు బైన మురళి గోల్కొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు సీనియర్ నాయకులు రేగుబాలశివ వేగిశెట్టి శ్రీను వాసం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!