లింగమనేని రమేశ్ నివాసం జప్తు పిటిషన్‌పై ఈనెల 6న తీర్పు..
విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ జప్తుపై ఏసీబీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. లింగమనేని గెస్ట్‌హౌస్ జప్తుపై సీఐడీ వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి..
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈనెల 6న నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్ నివాసాన్ని అటాచ్ చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును ఈనెల 6కి వాయిదా వేసింది..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



