వెల్దుర్తి పట్టణంలో కనీస మౌలిక సదుపాయాలను పరిశీలించిన జ్ఞానేశ్వర్ గౌడ్..

 

వెల్దుర్తి పట్టణంలో కనీస మౌలిక సదుపాయాలను పరిశీలించిన జ్ఞానేశ్వర్ గౌడ్..

వెల్దుర్తి/కర్నూల్ రూరల్ మే 18  అఖండ భూమి వెబ్ న్యూస్ :

మండల కేంద్రమైన వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ నందు ఆదివారం పట్టణంలోని పురవీధుల గుండా టిడిపి అగ్ర నాయకుడు ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ కనీస మౌలిక చదువుపాయాలను పరిశీలించడం జరిగింది. పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, పబ్లిక్ మంచినీళ్ల కుళాయిలు, మురుగు కాలువలు, వాటర్ ట్యాంకులను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ టిడిపి నాయకులు మాట్లాడుతూ.. పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కె ఈ శ్యాం కుమార్ ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి పట్టణంలోని పలు వార్డులలో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు తెలిపిన సమస్యలను పత్తికొండ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎస్సీ ఎస్టీ మానిటరీ కమిటీ సభ్యులు వీరభద్రుడు, ఎమ్మార్పీఎస్ గిడ్డయ్య, నాయకంటి చిన్న హరి, పెద్ద హరి, దాది పోగు రాజేష్, పసుల నాగ సురేంద్ర, పసుల బజారు, కరెంటు హరి, లైట్ల భాష, ముత్యాల సవాల్ రాజు, అబ్దుల్లా, పసుల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!