ఇందిరమ్మ ఇళ్ల పథకం, నిరుపేదలకు వరం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 17 (అఖండ భూమి న్యూస్);
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం, నిరుపేద కుటుంబాలకు వరంగా మారిందని భిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, బిబిపేట్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమా గౌడ్, రమేష్ లు అన్నారు. బీబీ పేట మండలం ఉప్పర్ పల్లి గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి గూడు కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తుందని అన్నారు. నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహేష్ మహేష్, పుట్ట మల్లేష్, బాయికాడ శ్రీనివాస్ గౌడ్, పరికల రవి, లింగం, బాబు గ్రామస్తులు పాల్గొన్నారు.