ముఖ్యమంత్రి శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గుంటూరు వచ్చిన సందర్భంగా హెలీపాడ్ వద్ద MLC కె. యస్. లక్ష్మణరావు ప్రాతినిధ్యం చేసిన అంశాలు
1. CPS ను రద్దు చేసి OPS ను పునరుద్ధరించాలి. 3 లక్షల ఉద్యోగులు , ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేర్చాలి. రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్ గఢ్ , హిమాచల్ ప్రదేశ్ మొదలైన రాష్ట్రాలు చేసిన విధంగా CPS రద్దు చేయాలి.
2. ఖాళీగా ఉన్న 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటానికి కొత్త DSC నోటిఫికేషన్ విడుదల చేయాలి.
3. 1998 DSC క్వాలిఫైడ్ అభ్యర్థులు 6800 మందికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరగగా 4072 మందికి MTS ఉద్యోగాలు ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. మిగిలిన వారికి కూడా ఇవ్వాలి.
4. గుంటూరు ఛానల్ విస్తరణకు 113 కోట్లు కేటాయించాలి.
5. గురుకులాలలో , యూనివర్సిటీలలో నాన్ – టీచింగ్ స్టాఫ్ కు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి.



