
మిషన్ ఎడ్యూకేషన్ లో భాగంగా దరఖాస్తులు సమర్పించిన సిసిఆర్ సభ్యులు
అల్లూరి జిల్లా డిఈఓ,ఆర్టిసి డిపో మేనేజర్ కు సహా దరఖాస్తు, వినతిపత్రం అందజేత.
అల్లూరి జిల్లా; పాడేరు, అఖండ భూమి వెబ్ న్యూస్ :
కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్) సంస్థ సభ్యులు శుక్రవారం,శనివారం రోజు అల్లూరి జిల్లా విద్యా శాఖ అధికారి(డిఈఓ), ఏపిఎస్ఆర్టిసి పాడేరు బస్సు డిపో మేనేజర్ లకు సమాచార హక్కు దరఖాస్తుతో పాటు వినతి పత్రం అల్లూరి జిల్లా సిసిఆర్ కో కన్వీనర్ కమ్మిడి శ్రీనివాస్(అడ్వకేట్) ఆధ్వర్యంలో అందజేశారు, ఈ సందర్బంగా సీసీఆర్ కో కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ… సీసీఆర్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రలలో ఎంతో ప్రతిష్టత్మకంగా చేపట్టిన మిషన్ ఎడ్యుకేషన్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడం లక్ష్యంగా జిల్లా స్థాయి విద్యా శాఖ అధికారులకు, అలాగే పాడేరు ఏపీఎస్ఆర్టిసి ద్వారా జిల్లాలో గల మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు పాఠశాలల సమయానికి బస్సులు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని సహా దరఖాస్తుతొ పాటు వినతి పత్రంను సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దరఖాస్తు చేసామని అన్నారు, సీసీఆర్ సంస్థ తరపున అల్లూరి జిల్లాలో సమాచారహక్కు చట్టం విశ్రుత ప్రచారంతో పాటు రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ కార్యల యాలలో సహా చట్టం సెక్షన్ 4(1)(B), అలాగే సెక్షన్ 5(1)5(2)ప్రకారం పిఐ ఓ,ఎపిఐఓ,అప్పిలెట్ అదారిటి బోర్డు లను ఏర్పాటుకు సీసీఆర్ సభ్యులు సిద్ధంగా వున్నారని అన్నారు.
ఈ కార్యక్రమములో సీసీఆర్ కో- కన్వీనర్ ఆర్టిఐ డివిజన్ ఇంచార్జి కమ్మిడి శ్రీనివాస్ (అడ్వకేట్), సభ్యులు సిదేరి రాజరత్నం, కిల్లో కామరాజు,ఆర్ లక్ష్మణ్,చిరంజీవి పాంగి,వంతల శంకర్ రావు,తదితరులు పాల్గొన్నారు.


