భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సోషల్ మీడియా సమావేశం

అఖండ భూమి వెబ్ న్యూస్ : –
అమలాపురం పార్లమెంట్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా సోషల్ మీడియా సమావేశం నేడు జిల్లా బిజెపి అధ్యక్షులు కర్రి చిట్టిబాబు అధ్యక్షతన, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రొక్కాల సత్తిబాబు,కో కన్వీనర్ చీకరమిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ,పూర్వ బిజెపి శాసనసభ్యులు శ్రీ మానేపల్లి అయ్యజీ వేమ గారు అమలాపురం పార్లమెంట్ పార్టీ ఇన్చార్జి శ్రీ పొట్లూరి రామ్మోహన్ రావు గారు , జిల్లా ప్రధాన కార్యదర్శి లు ,మోకా సుబ్బారావు,అడబాల సత్యనారాయణ, వల్లభనేని రవీంద్ర బాబు,విళ్ళ వెంకటేశ్వరరావు, హాజరు అవగా ,వివిధ మోర్చాల సోషల్ మీడియా కన్వీనర్లు కిసాన్ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కటికరెడ్డి తమ్మయ్యనాయుడు ,యువమోర్చ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యనమదల వెంకట రమణ, రాష్ట్ర స్వచ్చాభారత్ సెల్ కన్వీనర్ పాలూరి సత్యానందం, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్, సోషల్ మీడియా ఇన్ఫ్లయర్స్ హాజరై ఈ సమావేశం విజయవంతం చేయడం జరిగింది.


