భారతీయ జనతా పార్టీ – తూర్పుగోదావరి జిల్లా
బీజేపీ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల తో సమన్వయ సమావేశం
అఖండ భూమి వెబ్ న్యూస్ : –
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ 9 సంవత్సరాల సుపరిపాలన విజయాల ప్రచార కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక రాజమండ్రి మెయిన్ రోడ్ ఐరన్ , హార్డ్ వేర్ మరియు పెయింటర్స్ అసోసియేషన్ హాల్ నందు వ్యాపారస్తుల తో సమావేశం నిర్వహించారు
ఐరన్ హార్డ్ వేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బత్తుల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సనవేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు , మాజీ శాసనసభ్యులు శ్రీ ఆయాజి వేమ గారు , ఛాంబర్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వార్ గారు మరియు పెద్ద ఎత్తున వ్యాపారస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ఆయాజి వేమ గారు మాట్లాడుతూ నరేంద్రమోదీ మోడీ గారి 9 సంవత్సరాల పరిపాలన లో చేసిన అభివృద్ధి , సంక్షేమం మరియు జి.ఎస్టీ అమలు తర్వాత దేశ పురోగతి , జి.ఎస్టీ చెల్లింపుల ద్వారా వ్యాపారస్తులకు బ్యాంక్ రుణాలు తేలికగా మంజూరు అవ్వడం , ప్రపంచ వ్యాప్తంగా నరేంద్రమోదీ ద్వారా భారత దేశాన్ని అగ్ర రాజ్యం గా వస్తున్న గౌరవం తదితర అంశాలను వ్యాపారస్తులకు తెలియజేసారు.
తదుపరి వ్యాపారస్తులైన వెత్సా వెంకటేశ్వరరావు గారు , గంగుమళ్ళ లక్ష్మణరావు గారు జి ఎస్టీ తదితర అంశాలపై ఉన్నటువంటి సందేహాలను పేర్కొనగా శ్రీ వేమా గారు వాటిని నివృత్తి చేస్తూ వ్యాపారస్తుల సందేహాలు ,సమస్య లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసారు
అంతే కాకుండా త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వచ్చే అవకాశం ఉన్నందున మీ సమస్యలను నేరుగా వారికి తెలియజేసే అవకాశం కల్పిస్తామని తెలియజేసారు
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్ముల దత్తు గారు , బీజేపీ ఓబీసీ మోర్చా జోనల్ ఇంచార్జి కురగంటి సతీష్ గారు , బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు , సమావేశ ఇంచార్జి కాలెపు సత్యసాయిరామ్ , జిల్లా ప్రధాన కార్యదర్శిలు బూరా రామచంద్రరావు , పిక్కి నాగేంద్ర , అసెంబ్లీ కన్వీనర్ యెనుముల రంగబాబు తదితరులు పాల్గొన్నారు
బూరా రామచంద్రరావు – జిల్లా ప్రధాన కార్యదర్శి


