లాభసాటి వ్యవసాయం టిడిపి తోనే సాధ్యం –రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు-దాట్ల సుబ్బరాజు

 

లాభసాటి వ్యవసాయం టిడిపి తోనే సాధ్యం –రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు-దాట్ల సుబ్బరాజు

ఐ పోలవరం- అఖండ భూమి వెబ్ న్యూస్ : –

ఏరువాక పౌర్ణమి సందర్భంగా మురమళ్ళ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) మాట్లాడుతూ ముందుగా రైతులు అందరికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే ఏరువాక పౌర్ణమి అంటే రైతులకు అతిపెద్ద పండుగ, తొలకరి ఆసన్నమయ్యే సమయంలో దున్నడానికి సిద్దంగా ఉన్న పంట పొలాన్ని శుద్ది చేసుకుని సేద్యం మొదలుపెట్టే ఉత్సవమే ఏరువాక. భూమిని, పశువులను, సేద్యం పని ముట్లను పూజించే పూజ ఇది. ఏరువాక రోజు రైతులందరు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. చంద్రన్న పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేయడం జరిగింది. చంద్రన్న భవిషత్తుకు గ్యారెంటి లోని అన్నదాత పధకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 20 వేలు రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తామని మొన్న జరిగిన మహానాడులో చెప్పడం జరిగింది. ఈ జగన్ రెడ్డి పాలనలో రూ.2,45,554 రైతు అప్పుతో దేశంలోనే మొదటి స్థానం ,కౌలు రైతులు ఆత్మహత్యలలో 2 వ స్థానం ,ఎక్కువ అప్పులున్న రైతు కుటుంభా లలో మొదటి స్థానం.రాష్ట్రంలో జగన్ రెడ్డి నాలుగేళ్ళ పాలనలో అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. నేడు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు.అలాగే ముమ్మిడివరం నియోజకర్గం పరిశీలకులు కాలా సత్తిబాబు గారు మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో 9 తుఫాన్లలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే అరకొరగా పరిహారం చెల్లించారు. 2022-23 ఏడాదికి సంబంధించిన రబీ పంట భీమ ప్రీమియం చెల్లించకపోవడం పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. చంద్రన్న పాలనలో ఉన్న రూ.3 లక్షల వరకు ఉన్న పావలా వడ్డీ రుణాలు రద్దు చేసారు.చంద్రన్న వ్యవసాయాన్ని పండగ చేయగా, జగన్ రెడ్డి వ్యవసాయాన్ని దండగ చేసారు అని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!