జగ్గంపేటలో ఘనంగా ఏరువాక పౌర్ణమి
టిడిపి మేనిఫెస్టోలో రైతుకు సంవత్సరానికి అన్నదాత పథకంలో20000 కేటాయింపుతో ఆనందోత్సాహాల మధ్య చంద్రబాబు చిత్రపటానికి రైతులు పాలాభిషేకం
కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 4: (అఖండ భూమి) స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏరువాక పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో మొదటి మేనిఫెస్టోలో రైతుకు సంవత్సరానికి 20000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ రోజు ఏరువాక కార్యక్రమాన్ని రాష్ట్ర వేప్తంగా రైతులందరు ఎంతో సంతోషం గా జరుపుకోవాలిసిఉంది అని కాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యొక్క రైతు వెతిరేక విధానాలు, రైతు దివాలా విధానాలా వలన ఏరువాక జరుపుకునే స్థితి లో రైతులు లేరు అని వైసీపీ ప్రభుత్వం యొక్క దూరమార్గ విధానలే కారణం అని విమర్శించారు.రైతు భరోసా కింద సంవత్సరనికి 13500రూపాయలు చొప్పున 5 సంవత్సరాలో 67000రూపాయలు ఇవ్వాల్సి ఉండగా జగన్ కేవలం 37000రూపాయలు మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేసాడు అని ధరల స్థితికరణనిధి కింద 3వేల కోట్లు పెడతాను అని ప్రకృతి విపత్తుల నివారణనిధి కింద 4వేల కోట్లు పెడతాను అని ఎన్నికల ముందు హామీ ఇచ్చి సీ.ఎం అయ్యాక రైతులను మోసం చేసారు అని విమర్చించారు.పంటలు సంతోషంగా పండి రైతులకు సంతోషం కలగాని చంద్రబాబు నాయుడు రైతులకు మేలు చేయాలనీ ఉద్దెశం తో అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించాలని రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని అన్నారు. ఏరువాక పౌర్ణమి అంటే వ్యవసాయానికి ఉగాది లాంటిదని మంచి వర్షాలతో సమృద్ధిగా పంట పండి రైతులకి మంచి లాభం కలగాలని కోరారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్నదాత పథకం రైతులు అందరూ చాలా హర్షిస్తున్నారని.ఈ పథకం ద్వారా రైతులకు చాలా మేలు కలుగుతధాని అన్నారు.ఈ సందర్బంగా నియోజకవర్గం రైతుల తరుపున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము అని అన్నారు. నేను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకువచ్చానని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు ఆస్పవర్ కి 50 రూపాయల కె విద్యుత్ కలెక్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు అడపా భరత్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, మంగ రౌతు రామకృష్ణ, నాలుగు మండలాలతెలుగు రైతు అధ్యక్షులు నియోజవర్గంలో తెలియజేసిన పార్టీ ముఖ్య నాయకులు రైతులు పాల్గొన్నారు.


