క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో

పలు సేవా కార్యక్రమాలు జుత్తుకనూకాలమ్మ 3వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 4: (అఖండ భూమి) జగ్గంపేట మండలం రామవరం రిపబ్లికం పార్టీ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు మరియు క్యాండిల్ యూత్ వాలంటీ ఆర్గనైజేషన్ చైర్మన్ జుత్తుక నాగేశ్వరరావు వారి అమ్మగారు జుత్తుక నూకాలమ్మ మూడవ వర్ధంతి సందర్భంగా జగ్గంపేట లో ఉన్నటువంటి పేదవారికి అలాగే యాచకులకు చిన్న పిల్లలకు చికెన్ బిర్యానీ ప్యాకెట్స్, చిన్నపిల్లలకు పాలు మరియు చీరలు ,ఫాంటు షర్ట్లు , ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను ఆర్గనైజేషన్ పెట్టిన దగ్గర నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.నన్ను ప్రోత్సహిస్తూ నా సేవలను మెచ్చి అనేకమంది వారి,వారి సహాయ సహకారాలు అందిస్తూ పదిమందికి సహాయం చేసే అదృష్టం నాకు కలిగించారని అలాగే ఏదైనా ఫంక్షన్ లో ఆహారం మిగిలిపోతే ఆ ఆహారం వృధా చేయకుండా ఎంతోమందికి పేదవారికి అందించడం జరిగింది.ఇలాంటి గొప్ప సేవకార్యక్రమం చేయడం నాకు ఎంతో సంతోషమని ఇదంతా కూడా కరోనా సమయంలో తెలుసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ,మున్ముందు ఎంతోమందికి సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు దయచేయాలని మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అమ్మ మమ్ములను ఎంతో కష్టపడి ప్రయోజకులను చేసిన అమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నానని ఆయన అన్నారు. అమ్మ ఈ లోకం విడిచిన ఆమె జ్ఞాపకాలను మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ ఆమెకే అంకితం ఇస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.


