తెదేపా తోనే రైతులకు నిజమైన పండుగ…

 

 

తెదేపా తోనే రైతులకు నిజమైన పండుగ.

మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్దం

ఎస్.రాయవరం. అఖండ భూమి వెబ్ న్యూస్ : –

రాష్ట్రాన్ని అప్పులతో అంధకారంలో ముంచి వ్యవసాయాన్ని, రైతాంగాన్ని అదోగతి పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్దం అన్నారు. రైతన్నల పండుగ ఐన ఎరువాక పౌర్ణమి సందర్బంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన రైతులతో కలిసి పొలంలో నాగలి పట్టిన అనంతరం మాట్లాడుతూ రైతులకు, వ్యవసాయానికి మంచిరోజులు కావాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నదని, విజన్ కలిగిన నాయకుడిగా పేరు ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని,జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని రైతన్నలకు సరైన గిట్టుబాటు ధరలు లేక, అవస్థలు పడుతున్నారని, వైకాపా పాలనలో 2,45,554 కోట్ల రైతుల అప్పుతో దేశంలోనే మొదటి స్థానం లో ఉన్నదని, కౌలు రైతుల ఆత్మహత్యలతో దేశంలో రెండవ స్థానం లో ఉన్నదని, అలాగే ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్నదని,రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక,రుణాలు మంజూరు చేయక,ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించకుండా రైతులను దగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదని ఆయన అన్నారు.మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని, నాలుగు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు.చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగంలో 11% వృద్ధి రేటు సాధించిన ఈ రాష్ట్రం, వైకాపా ప్రభుత్వ పాలనలో రైతన్నల ఆవేదనలతో, అప్పులతో, రైతుల ఆత్మహత్యలతో సరికొత్త రికార్డులను సాధిస్తుందని తెలిపారు. మరలా రాష్ట్రం అభివృద్ధి జరగాలన్న, వ్యవసాయానికి, రైతులకు మంచిరోజులు రావాలన్న మళ్ళీ తెదేపా అధికారంలోకి రావాలని, ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!