వ్యాన్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి.
ఎస్.రాయవరం. అఖండ భూమి వెబ్ న్యూస్ : –
మండలంలోని గోకులపాడు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రాజమండ్రి దగ్గర కొంతమూరు గ్రామానికి చెందిన రావడ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. గత రాత్రి నర్సింగపల్లిలో బాయిలర్ కోళ్లను తన వ్యాను లో లోడు వేసుకుని తన క్లీనర్ అయిన రాజుతో రాజమండ్రి వెళ్తూ భోజనం చేయడానికి ఎస్.రాయవరం మండలం గోకులపాడు జాతీయ రహదారి వద్దనున్న భారత పెట్రోల్ బంకు ఎదురుగా గల మట్టి రోడ్డుపై వాహనాన్ని ఆపి భోజనం చేసిన అనంతరం కాలకృత్యాలు తీర్చుకొని రోడ్డు దాటుతుండగా రాత్రి సుమారు 1:30గం సమయంలో యలమంచిలి నుండి తుని వైపు వెళ్తున్న AP39UA9311 నెంబరు గల మినీ వ్యాను బలంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయని 108 లో హుటాహుటిన అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమథ్యంలో మృతి చెందాడని తెలిపారు.ఇదే ఘటనలో ఢీకొట్టిన వ్యాను డ్రైవర్ తలకు బలమైన గాయాలు కావడంతో నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.



