ఘనంగా సూర్యదేవునికి మహా కుంభాభిషేకం
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం
గొల్లల మామిడాడలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడ శ్రీ ఉష పద్మనీ ఛాయా సౌమ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం మహా కుంభాభిషేకం నిర్వహించారు. 1001 కలశాలతో 1001 మంది దంపతులచే ఆలయ శిఖరమునకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మహా కుంభాభిషేకాన్ని నిర్వహించారు పండితులు రేజేటి రామాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త కొవ్వూరి బాలకృష్ణారెడ్డిచే రామాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు ఇరువురికి సువర్ణకంకణాధారణతో పండిత సత్కారం చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని దశాబ్దాల తర్వాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సహస్ర కలశ మహా కుంభాభిషేకాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు తెలియజేశారు. ఆలయానికి ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున సహస్ర కలసాభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి అన్నదాన కమిటీ, ఉత్సవ కమిటీ వేలాదిగా భక్తులు పాల్గొన్నారు



