గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
అల్లూరి జిల్లా ఏఓబి/ గూడెం కొత్త వీధి (అఖండ భూమి) మావోయిస్టు అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్(69) గుండెపోటుతో మృతి చెందారు. చత్తీస్గఢ్ లోని దండకారణ్యంలో మే 31 మధ్యాహ్నం ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల బస్తీకి చెందిన సుదర్శన్ అలియాస్ ఆనంద్, అలియాస్ దూలా ప్రస్తుతం బస్తర్ మావోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత సుదర్శన్ అలియాస్ ఆనంద్ కు దండకారణ్యంలోనే పార్టీ అగ్రనాయకత్వం ఆధ్వర్యంలో దహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని పార్టీ ప్రకటించింది కాగా మృతి చెందిన సుదర్శన్ కుటుంబానికి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని తెలిపారు


