మృతుని కుటుంబాన్ని పరామర్శించిన రమణారావు.
అమలాపురం అఖండ భూమి వెబ్ న్యూస్ : –
ఉప్పలగుప్తం.గొల్లవిల్లి గ్రామానికి చెందిన నవ చైతన్య దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్ సిపి నాయకుడు దేవరపల్లి వెంకటేశ్వరరావు మేనల్లుడు గెడ్డం ధనరాజు(26) ఇటీవల అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందాడు.మృతుని తండ్రి లక్ష్మణరావు కుటుంబ సభ్యులను ఆదివారం అమలాపురం నియోజకవర్గం వైఎస్సార్ సిపి సీనియర్ నాయకుడు,గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.చిన్న వయసులో ధనరాజు మృతి చెందడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులకు రమణారావు ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్ సిపి నాయకులు జొన్నాడ చిన్ని,గంటా ప్రసాద్,నేరేడుమిల్లి శ్రీను,కుంచే అర్జున్,నాగాబత్తుల రాజ్ కుమార్,పోలినాటి భీమేష్, పరమట రాజేష్,దోనిపాటి రాంబాబు,జూనియర్ జగన్ రాజశేఖర్, దేవరపల్లి నాగ బాబు,ములపర్తి నవీన్, పరమట మురళి తదితరులు పాల్గొన్నారు.



