
రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి.
ఆలమూరు అఖండ భూమి వెబ్ న్యూస్ : –
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ నుండి అంగర వెళ్లే మార్గం మధ్యలో పెద్దపళ్ల గ్రామ సరిహద్దు లు వద్ద ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక పోలీస్ సిబ్బంది తెలియజేశారు.వారు తెలియజేసిన వివరాలు ప్రకారం మండపేట మండలం కేశవరం గ్రామంలో మైత్రి ఫర్నిచర్ షాప్ లో పొట్టకూటి కోసం పనిచేసుకుంటున్న కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామానికి చెందిన సుంకర బాబా ప్రసాద్(30) అనే వ్యక్తి తన పనిని ముగించుకుని స్వగ్రామం చేరుకునే తరుణంలో పెద్దపళ్ల గ్రామ సరిహద్దులు వద్దకు వచ్చేసరికి సంధిపూడి వైపు నుండి కొత్తూరు సెంటర్ వైపుకు వెళ్తున్న ఏపీ 37 ఏయస్ 7547 నెంబర్ గల రైతువారి టాక్టర్ ప్రమాదవశాత్తు తన ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడం తో బాబా ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ మేరకు మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలియజేశారు.


