యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ఆధ్వర్యంలో
ఒ. ఎన్. జి.సి. సంస్థ, 3వ విడత ఉచిత
ఐ.క్యాంపు, యానం అఖండ భూమి వెబ్ న్యూస్ : –
(అఖండ భూమి) యానాం కామిశెట్టి పరుశరామ వర ప్రసాదరావు నాయుడు ప్రభుత్వ ఉన్నతపాఠశాల
కనకాలపేట గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు స్థానిక ఒ.ఎన్.జి.సి సంస్థ ద్వారా నిర్వహించిన మూడవ విడత మెగా హెల్త్ క్యాంపు ఘనంగా జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ,ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామి,సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం హాస్పిటల్ ఏ.డి పలాష్ కుమార్ పాన్యల్, తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా హెల్త్ క్యాంపు కి సుమారు 396 మందికి హెల్త్ చెకప్ మరియు కంటి పరీక్ష చేసుకోవడం జరిగిందని అందులో సుమారు 50 మంది కి కంటి ఆపరేషన్ నిమిత్తం రాజమహేంద్రవరం పరమహంస యోగానంద నేత్రాలయ పౌండేషన్ కి పంపించడం జరిగిందని 210 మందికి పైగా కళ్ళ జోడ్లు పంపిణీ చేయడం జరిగిందని, యానంలో ఇలాంటి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం ద్వారా ఎంతో మంది పేద-ప్రజలకు మేలు చేకూరుతుందని స్థానికులు, ఆయప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ని అభినందించారు.ఉచిత హెల్త్ క్యాంప్ ను చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తెలిపారు.లయన్స్ క్లబ్ పిల్లారాయ అధ్యక్షతనలో ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని,సంస్థ నుండి ఇలాంటి మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని సంస్థ అధ్యక్షుడు పులవర్తి శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో
కనకాలపేట గ్రామ పెద్దలు, నాయకులు,యువకులుయువత నాయకులు తదితరులు పాల్గొన్నారు.



