యానం అఖండ భూమి వెబ్ న్యూస్ : –
కనకాలపేట ఇండోర్ స్టేడియంను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించిన యానాం శాసన సభ్యులు
లక్షలాది రూపాయిల ఖర్చుతో చేపట్టిన కనకాలపేటగ్రామ ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తయ్యి సంవత్సరం పైగా గడుస్తున్నా ప్రారంభించడం లేదని తక్షణం ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని కనకాలపేట గ్రామస్ధులు ఆదివారం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ప్రాంతీయ పరిపాలన అధికారి మునిస్వామి దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక కనకాలపేట కామిశెట్టి పరశురామ వరప్రసాద్ రావు నాయుడు ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ప్రారంభించిన అనంతరం స్కూల్ ఆవరణలో ఉన్న సమస్యలు,ఇండోర్ స్టేడియం,స్కూల్ ఆవరణలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే అశోక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజాపనులశాఖ ఇంజనీరు నాగరాజును స్టేడియం నిర్మాణం పూర్తయ్యి సంవత్సరం గడుస్తున్నా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. అదేవిధంగా స్టేడియం నిర్వహణ లేకపోవడంతో స్టేడియం ఆవరణ చుట్టూ పిచ్చిమొక్కలు మొలవడమే కాకుండా పాములు సైతం వస్తున్నాయని స్థానిక యువకులు ఎమ్మెల్యే అశోక్ దృష్టికి తీసుకువచ్చారు ఇండోర్ స్టేడియంలో సెంట్రల్ ఏ.సి వేయాల్సివుందని దీనికి టెండర్లు పిలవాల్సివుందని ఇంజనీరు నాగరాజు తెలిపారు ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ స్టేడియం నిర్మాణం పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎందుకు ఏ.సీ కి సంబంధించి టెండర్స్ ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. స్టేడియం తాళాలువేసి ఉంచడానికి కాదని త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే అశోక్ అధికారులను ఆదేశించారు….



